Monday, January 20, 2025

ముజిగల్‌ కొంపల్లి శాఖను సందర్శించిన సరిగమప లిటిల్‌ ఛాంప్స్‌..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ప్రీమియర్‌ సంగీత అకాడమీ ముజిగల్‌, కొంపల్లి శాఖను సరిగమన లిటిల్‌ ఛాంప్స్‌, తెలంగాణా అభ్యర్ధులు సందర్శించారు. వీరిలో వాగ్దేవి, శశాంక్‌, శ్రావణి ఉండటంతో పాటుగా తమ అద్భుతమైన ప్రదర్శనలతో ఔత్సాహిక సంగీత కారులను సంభ్రమాఽశ్చర్యాలలో ముంచెత్తారు. అంతేకాకుండా ఇటీవల ట్రినిటీ పరీక్షలను పాస్‌ అయిన వారికి సర్టిఫికెట్లను సైతం అందజేశారు.

ఈ సందర్భంగా ముజిగల్‌ కొంపల్లి శాఖ ఫ్రాంచైజీ భాగస్వామి మాట్లాడుతూ సరిగమప లిటిల్‌ ఛాంప్స్‌ తెలంగాణా పార్టిస్పెంట్లు మా శాఖను సందర్శించడంతో పాటుగా మా విద్యార్ధులకు స్ఫూర్తి కలిగించడం పట్ల సంతోషంగా ఉన్నామన్నారు.

వారి సందర్శన మా విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు సైతం స్ఫూర్తి కలిగించింది. ఈ యువ చాంఫియన్స్‌ ట్రినిటీ పరీక్షల సర్టిఫికెట్లను మా విద్యార్ధులకు అందజేయడం ఆనందంగా ఉందని ముజిగల్‌ ఫౌండర్‌ డాక్టర్‌ లక్ష్మీ నారాయణ యేలూరి అన్నారు.

ఈ కార్యక్రమంలో సంగీతాభిమానులు, సామాన్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ మరుపురాని సంగీతానుభవాలను ఇది అందించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News