Thursday, January 23, 2025

తండ్రైన టీమిండియా సెన్సేషన్ సర్ఫరాజ్‌ ఖాన్..

- Advertisement -
- Advertisement -

ముంబై: టీమిండియా యువ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ తండ్రయ్యాడు. అతడి భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సర్ఫరాజ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. బిడ్డను ఎత్తుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. గతేడాది రోమానా జహూర్‌తో సర్ఫరాజ్‌కు వివాహమైంది.

కాగా, దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించే సర్ఫరాజ్ టీమిండియాలో చోటు కోసం చాలా కాలం వేచిచూడాల్సింది. చివరికి ఈ ఏడాది రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అతనికి జాతీయ జట్టులో స్థానం లభించింది. ఇటీవల బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ చిరస్మరణీయ శతకం సాధించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News