Sunday, January 19, 2025

సూర్య సందేశంతోనే మ్యాచ్‌ను వీక్షించాను: సర్ఫరాజ్ తండ్రి

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్: టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. మ్యాచ్ కు ముందు అనిల్ కుంబ్లే నుంచి ఖాన్ టోపీ అందుకున్నాడు. అదే సమయంలో అక్కడ ఉన్న అతడి తండ్రి నౌషద్ ఖాన్, భార్య కన్నీళ్లు పెట్టుకున్నారు. అతడి తండ్రి టోపీని తీసుకొని ముద్దాడాడు. సూర్యకుమార్ యాదవ్‌తోనే తన కుమారుడి ఆడుతున్న మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూశానని వివరణ ఇచ్చాడు. తాను మ్యాచ్‌కు వస్తే సర్ఫరాజ్ ఖాన్ ఒత్తిడికి లోను అవుతాడని, దీనికి తోడు తన ఆరోగ్యం సహకరించడంలేదని, అందుకే రాకూడదని నిర్ణయం తీసుకున్నానని నౌషద్ ఖాన్ తెలిపాడు. సూర్య పంపించిన సందేశం తన మనసును కరిగించిందని, తొలి టెస్టు ఆడుతున్నప్పుడు ఉద్వేగాన్ని అర్థం చేసుకోగలనని చెప్పాడు. తాను తొలి టెస్టు ఆడుతున్నప్పుడు తల్లిదండ్రులు వెనకే ఉన్నారని సూర్య తెలిపాడు. అలాంటి క్షణాలు మళ్లీ మళ్లీ రావు అని , మ్యాచ్ వెళ్తే బాగుంటుందని నౌషద్‌కు సూర్య మెసేజ్ చేశాడు. దీంతోనే నౌషద్ మ్యాచ్ చూడాటానికి రాజ్ కోట్ కు వెళ్లాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News