Monday, January 20, 2025

సర్ఫరాజ్ సెంచరీల మోత

- Advertisement -
- Advertisement -

ముంబై: రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన తర్వాత రంజీ ట్రోఫీలో పరుగుల ప్రవాహం పారిస్తున్నాడు. ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మరో శతకం నమోదు చేశాడు. 205 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 153 పరుగులు చేసిన సర్ఫరాజ్ సువెద్ పార్కర్‌తో కలిసి నాలుగో వికెట్‌కి 267 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి.. మయాంక్ మిశ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్ అయ్యాడు. ఈ సీజన్‌లో సర్ఫరాజ్ ఖాన్‌కి ఇది మూడో సెంచరీ కాగా, ఇప్పటికే 2022 సీజన్‌లో 600 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కాగా, సర్ఫరాజ్ ఖాన్ సెంచరీకి తోడు సువెద్ పార్కర్ కూడా సెంచరీతో చెలరేగడంతో 122 ఓవర్లుమ ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 452 పరుగులు చేసిన ముంబై జట్టు, భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతోంది.

Sarfaraz Khan hit one more Century in Ranji Trophy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News