Monday, December 23, 2024

సంక్షేమంలో “సరిలేరు మాకెవ్వరూ”

- Advertisement -
- Advertisement -

* ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

* ఘనంగా సంక్షేమ సంబరాలు
మక్తల్ : సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంలోనూ.. విజయవంతంగా అమలు చేయడంలోనూ దేశంలో కెసిఆర్ సర్కారుకు, మక్తల్ ని యోజకవర్గంలో తనకు “సరిలేరు మాకెవ్వరూ”.. అని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అ న్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా మక్త ల్ నియోజకవర్గంలో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించి దాదాపు 15వేల మం దికి రూ.150కోట్ల ఆర్థిక సహాయం అందించి రికా ర్డు సాధించామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మక్త ల్ పట్టణంలోని వట్టం రవి కన్వెన్షన్ హాల్లో శుక్రవారం నియోజకవర్గ స్థాయి సంక్షేమ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన లబ్ధ్దిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, బిసి కులవృత్తుల లబ్ధ్దిదారులకు ఆర్థిక సహాయం చెక్కులతో పాటు గొల్ల కురుమలు, కురుమలకు రెండవ విడత గొర్రెల పంపిణీ, అనుగొండ దళితులకు ఇండ్ల స్థ లాల పట్టాలను నారాయణపేట జడ్పీ ఛైర్ పర్సన్ కె.వనజ ఆంజనేయులు గౌడ్‌తో కలిసి ఎమ్మెల్యే చిట్టెం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాల తో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. ఆడబిడ్డల పెండ్లిలకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, మత్సకారులకు చేపల పెంపకంతో ఉ పాధి, రజకులు, నాయి బ్రాహ్మణులకు సంక్షేమ ప థకాలతో పాటు దళిత బంధుతో వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కు దక్కిందన్నారు. బిసి కులవృత్తుల వారికి ఉచితంగా రూ.1లక్ష ఆర్థిక సహాయం అందిస్తున్నామని, దీన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధి మా ర్గాలను పెంపొందించుకోవాలన్నారు. దళిత బం ధు యూనిట్లు మరో 1100మందికి ప్రభుత్వం మ ంజూరు చేసిందన్నారు.

త్వరలోనే గ్రామాల వారీగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టి యూనిట్ల ను అందిస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని సం క్షేమ పథకాలు తెలంగాణలో అమల్లో ఉన్నాయన్నారు. త్వరలోనే గృహలక్ష్మి పథకం ద్వారా ఇం డ్లు లేని నిరుపేదలకు రూ.3లక్షల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. బిసిలు, ఎస్సీలు, ఎస్టీల సంక్షే మం కోసం నియోజకవర్గంలో మొత్తం 6గురుకుల పాఠశాలలతో పాటు కెజిబివిలు, ఇంటర్, డిగ్రీ క ళాశాలలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నా రు. బిడ్డ పుట్టినప్పడు కెసిఆర్ కిట్‌తో పాటు చదు వు, పెండ్లిలకు ఆర్థిక సహాయంతో పాటు అనేక రకాలుగా ప్రభుత్వం తోడ్పాటును అందిస్తున్నదన్నారు. ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా మక్తల్ ప్ర భుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరుగుతున్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని మక్తల్‌కు నూతనంగా 150పడకల ఆసుపత్రిని మంజూరు చేయించామన్నారు. ఇందులో ప్రత్యేకంగా మహిళలకు 50పడకలను కేటాయించామన్నారు. త్వరలోనే పనులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు.
కెసిఆర్ పాలన స్వర్ణయుగం..
తెలంగాణ ఉద్యమ నాయకుడే, రాష్ట్రానికి మొదటి సిఎంగా బాధ్యతలు చేపట్టి పాలన సాగిస్తు ండడ ంతో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, కెసిఆర్ పాలన రాష్ట్రంలో స్వర్ణయుగం వంటిదని నారాయణపేట జడ్పీ ఛైర్‌పర్సన్ కె.వనజ ఆంజనేయులు గౌడ్ అ న్నారు.అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యే యంగా ప్రభుత్వం నూతన పథకాలకు శ్రీకారం చుడుతున్నదన్నారు.ప్రజలు పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు.
చెక్కులు, గొర్రెలు, పట్టాల పంపిణీ..
మక్తల్ నియోజకవర్గంలోని మక్తల్, మాగనూరు, కృష్ణా, ఊట్కూరు, నర్వ, అమరచింత, ఆత్మకూరు మండలాలకు చెందిన దాదాపు 610మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందించారు. అలాగే బిసి కులవృత్తుల వారికి రూ. 1లక్ష ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను లబ్ధ్దిదారులకు అందించారు. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు రూ.2.5లక్షల ప్రోత్సాహక నగదు చెక్కులను అందించారు. అలాగే మక్త ల్ మండలంలోని వనాయికుంట, అంకెన్‌పల్లి గ్రా మాల్లోని లబ్ధ్ద్దిదారులకు రెండవ విడత గొర్రెల పం పిణీలో భాగంగా 21గొర్రె పిల్లలను అందించారు. అనుగొండ దళితులకు 45మందికి ఇండ్ల స్థలాల పట్టాలను అందించి సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పి సీఈఓ జ్యోతి, టిఎస్‌టిపిసి మాజీ ఛైర్మన్ దేవరి మల్లప్ప, ఎంపిపిలు వనజ, ఎల్కోటి లక్ష్మీ, జడ్పీటిసిలు వెంకటయ్య, అ శోక్‌గౌడ్, ఎంపిడీఓ శ్రీధర్, ఎంపిఓ పావని, డిటి లు సురేష్, వాసుదేవరావు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ పావని, ఏపిఓ గౌరీశంకర్, ఏపిఎం వనజ, సర్పంచులు గడ్డం రమేష్, అంకెన్‌పల్లి లక్ష్మణ్, రాధా నర్సింహా యాదవ్, కళావతి శేఖర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, కల్పన కృష్ణచారి, మహదేవమ్మ శంకర్, ఎంపిటిసిలు జ.బలరాంరెడ్డి, నంబర్ పద్మమ్మ, లక్ష్మీ నర్సిరెడ్డి, నాయకులు మహిపాల్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, రుద్రసముద్రం రామలింగం, నేతాజీరెడ్డి, శివారెడ్డి, బండారి ఆనంద్, జుట్ల సాగర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News