Wednesday, January 22, 2025

క్లైమాక్స్ షూటింగ్‌లో ’సరిపోదా శనివారం’

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని తన అప్ కమింగ్ పాన్ ఇండియా ఫిల్మ్ ’సరిపోదా శనివారం’లో సూర్య పాత్రలో మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ పవర్-ప్యాక్డ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ అడ్రినలిన్‌తో కూడిన యూనిక్ అడ్వెంచర్‌ని భారీ కాన్వాస్‌పై హై బడ్జెట్‌తో డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా చిత్ర బృందం క్లైమాక్స్ షూటింగ్‌ను ప్రారంభించింది. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్‌ను నిర్మించారు. ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుండగా, ఎస్‌జె సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News