Monday, January 20, 2025

‘సరిపోదా శనివారం’ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని తన అప్ కమింగ్ పాన్ ఇండియా ఫిల్మ్ ’సరిపోదా శనివారం’లో సూర్య పాత్రలో మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ పవర్-ప్యాక్డ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ అడ్రినలిన్‌తో కూడిన యూనిక్ అడ్వంచర్ ని భారీ కాన్వాస్‌పై హై బడ్జెట్‌తో డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌ను ఈనెల 15న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జేక్స్ బిజోయ్ ఈ సినిమా కోసం అద్భుతమైన ఆల్బమ్ కంపోజ్ చేశారు. మేకర్స్ రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ వీడియోలో నాని స్లో మోషన్ లో నడుచుకుంటూ వచ్చి క్లాత్ ని తొలగించాక టేప్ రికార్డ్ రివిల్ కావడం, పవర్ ప్యాక్డ్ మ్యూజిక్ వినిపించడం చాలా ఆసక్తికరంగా వుంది. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎస్‌జె సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News