Wednesday, January 22, 2025

నాని బర్త్డే గిఫ్ట్: ‘సరిపోదా శనివారం’ గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ ..

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని తన అభిమానులకు బర్త్డే ట్రీట్ ఇచ్చాడు. ప్రస్తుతం తను నటిస్తున్న సరిపోదా శనివారం మూవీ గ్లింప్స్ వచ్చేసింది. ఫిబ్రవరి 24 శనివారం నాని పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను హ్యాపీ శనివారం అంటూ విడుదల చేశారు. ఎస్‌జే సూర్య వాయిస్‌ ఓవర్‌తో రిలీజైన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. చాలా ప్రెష్ ఫీల్ తోపాటు బ్యాక్ గ్రౌండ్ స్కోరు అదిరిపోయింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. యూట్యూబ్ లో ఈ గ్లింప్స్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

అంటే సుందరానికి తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ దర్శకత్వం ఈ చిత్రాన్ని.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి హై బడ్జెట్‌‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న సరిపోదా శనివారం ఆగస్టు 29న థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News