Wednesday, January 22, 2025

‘ఉల్లాసం..’తో మ్యాజికల్ ట్రీట్

- Advertisement -
- Advertisement -

‘సరిపోదా శనివారం’ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ గరం గరం నేచురల్ స్టార్ నాని ఫెరోషియస్ క్యారెక్టర్‌ని చూపించింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. మాస్ ఫీస్ట్ తర్వాత, మేకర్స్ శనివారం సినిమా సెకండ్ సింగిల్ ఉల్లాసం సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇది మ్యాజికల్ ట్రీట్‌ను అందిస్తుంది. ఇది క్లాసికల్, జాజ్ మ్యూజిక్ ఫ్యూజన్, రొమాంటిక్ నెంబర్ ఇన్‌స్టంట్ గా హిట్ అవుతోంది. సనరే రాసిన లిరిక్స్ నాని, ప్రియాంక మోహన్‌ల ఫీలింగ్స్ ని బ్యూటీఫుల్‌గా చూపిస్తోంది. సంజిత్ హెగ్డే తన వోకల్స్ తో పాటకు ప్రాణం పోయగా, కృష్ణ లాస్య ముత్యాల కూడా తన వాయిస్‌తో మ్యాజిక్ చేసింది. పాన్ ఇండియా అడ్రినలిన్ ఫీల్ యాక్షన్-అడ్వెంచర్ సరిపోదా శనివారంలో ఎస్‌జె సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News