Monday, December 23, 2024

దూసుకుపోతున్న ‘సరిపోదా శనివారం’

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ బ్లాక్ బస్టర్ మూవీ ’సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా, ఎస్‌జె సూర్య పవర్ ఫుల్ రోల్ నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించారు. ఇటీవల తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన స్పందనతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని, హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా టీం విజయ వేడుక నిర్వహించింది.

నిర్మాత దిల్ రాజు, దర్శకులు హను రాఘవపూడి, శివ నిర్వాణ, రాహుల్ సంకృత్యాన్ అతిధులుగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. విజయ వేడుకలో ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ “వివేక్ మాస్ స్టయిలిష్ యాక్షన్‌ని నాని ద్వారా చూపించాడు. ఇంత వర్షాల్లో కూడా సినిమా 40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తొందరలోనే వరల్ వైడ్ 100 కోట్లు కలెక్ట్ చేయబోతోంది”అని పేర్కొన్నారు. నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ “సరిపోదా శనివారం సక్సెస్ వివేక్ అకౌంట్‌లోనే వేస్తున్నాను. జెర్సీలో అర్జున్ సక్సెస్ అయితే సత్య రాజ్ ఎంత ఆనందపడతారో వివేక్ సక్సెస్ చూసి నేను అలానే ఆనందపడుతున్నాను. అంటే సుందరానికీ అనే డ్రామా తీశాం.

ఇప్పుడు యాక్షన్ ఎంటర్‌టైనర్. మళ్ళీ కలసి పని చేసినప్పుడు కామెడీ తీద్దాం. ఆడియన్స్ సీట్లో పడిపడి నవ్వాలి. అది నా కోరిక”అని అన్నారు. మూవీ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ “ఇండస్ట్రీలో16 ఏళ్ళు పూర్తి చేసుకున్న నానికి అభినందనలు. నేను రాసిన దానికంటే అద్భుతంగా పర్ఫార్మ్ చేసిన నాని, సూర్య, ప్రియాంక, సాయి కుమార్… అందరికీ పేరుపేరునా థాంక్స్‌”అని తెలిపారు. ఈ వేడుకలో ఎస్‌జె సూర్య, ప్రియాంక మోహన్, జేక్స్ బిజోయ్, అలీ, శుభలేఖ సుధాకర్, హర్ష వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News