Friday, December 27, 2024

ఓటీటీలోకి వచ్చేసిన ‘సరిపోదా శనివారం’.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని, యంగ్ బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోహీరోయిన్లుగా వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’. ఇటీవల విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే ఈ మూవీ భాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. వెండి తెరపై అలరించిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఎస్.జే.సూర్య విలన్‌గా నటించి ప్రశంసలు అందుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News