Friday, January 3, 2025

‘సరిపోదా శనివారం’ పెద్ద హిట్ కాబోతోంది

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ఎస్‌జె సూర్య పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నారు. ఈనెల 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మూవీ యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

ప్రెస్ మీట్‌లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ “దానయ్య ‘ఆర్‌ఆర్‌ఆర్’ లాంటి సక్సెస్ చూసిన తర్వాత అంత తొందరగా ఏదీ ఆనదు. కానీ ఈ సినిమా ఆనుతుందనే నమ్మకం వుంది. వివేక్ రెండు నెలలుగా నిద్రపోయింది లేదు. ఆ కష్టం తెరపై కనిపిస్తుంది. ఈసారి వాళ్ళందరి కోసం సినిమా వేరే లెవెల్‌కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రీరిలీజ్ ఈవెంట్ 24న జరగబోతోంది”అని అన్నారు.

ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ “ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత దానయ్య బ్యానర్ నుంచి వస్తున్న ఈ సినిమా తెలుగు స్టేట్స్ డిస్ట్రిబ్యుషన్ రైట్స్‌లో పార్ట్ చేసినందుకు థాంక్స్. ఎస్‌జె సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాలి. నాని, ఎస్‌జె సూర్య ఇద్దరూ పోటాపోటీగా నటించారు. ట్రైలర్ చూస్తూనే అర్ధమవుతోంది. వివేక్ చాలా సర్‌ప్రైజ్ చేశాడు. అంతకుముందు సినిమాలని సాఫ్ట్‌గా తీశాడు. ఈ సినిమాని ఇరగదీశాడు. నానితో మేము చేసిన ఎంసిఏ పెద్ద హిట్టు. దాన్ని దసరా బీట్ చేసింది. దసరాని సరిపోదా శనివారం బీట్ చేయబోతోందని ట్రైలర్ చూసి నమ్మకంగా చెప్పొచ్చు”అని పేర్కొన్నారు.

ప్రొడ్యూసర్ డివివి దానయ్య మాట్లాడుతూ.. “ సరిపోదా శనివారం చాలా బాగా వచ్చింది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి నాని. మొదటి నుంచి చివరి వరకూ చాలా బాగా చేశారు. డైరెక్టర్ గారు కూడా అద్భుతమైన కథ రాశారు, గొప్పగా తీశారు. సూర్య, ప్రియాంక మోహన్ ఇలా అందరూ చక్కగా నటించారు. జేక్స్ బిజోయ్ చాలా అద్భుతమైన మ్యూజిక్ చేశారు. సినిమా పెద్ద హిట్ కాబోతోంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ప్రియాంక మోహన్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News