Wednesday, January 22, 2025

‘సరిపోదా శనివారం’ బ్లాక్‌బస్టర్ అవుతుంది: నాని

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ’సరిపోదా శనివారం’ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌తో నిర్మించారు. ఈనెల 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘సరిపోదా శనివారం’ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సరిమప.. ప్రమోషనల్ సాంగ్ కూడా విడుదలైంది. ఈ వేడుకలో దేవకట్టా, శ్రీకాంత్, సుధాకర్ చెరుకూరి, శైలేష్ కొలను, ప్రశాంత్ వర్మ, ఎస్.జె. సూర్య, ప్రియాంక అరుణ్ మోహన్, కెమెరామెన్ మురళీ, సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. ‘టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ట్రైలర్‌లో చిన్నగా అరిచాను. ఈనెల 29న అందరూ అంతరేంజ్‌లో సక్సెస్ ఇవ్వాలి. వివేక్ ఏమి తీశాడో 29న మీకే తెలుస్తుంది. అతని శివతాండవం ఈ సినిమాలో చూపించాడు. మా కష్టాన్ని చూసి మీరు ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా. ఇక ఎస్.జె. సూర్య పాత్రకు మంచి పేరు వస్తుంది’ అని అన్నారు.

చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. ‘నాని నాకు సినిమా ఛాన్స్ ఇచ్చారు. అందుకే థ్యాంక్స్ చెబితే సరిపోదు అనుకుని ఆయనకు నాపై వున్న నమ్మకానికి సరిపోదా శనివారం సినిమా ఇచ్చాను’ అని తెలిపారు. చిత్ర నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ.. ‘సరిపోదా శనివారం బ్లాక్ బస్టర్ అవుతుంది. నాని కథల ఎంపికలో బెస్ట్. కథ నచ్చితే కొత్త దర్శకుడయినా అవకాశం ఇస్తారు. నానితో సినిమా చేస్తే నిర్మాతకు టెన్షన్ వుండదు. అన్నీ ఆయనే చూసుకుంటారు. ఇక ఎస్.జె. సూర్య నటనలో ఇరగదీశారనే చెప్పాలి’ అని పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News