Monday, December 23, 2024

‘సర్కారు నౌకరి’ టీజర్ విడుదల

- Advertisement -
- Advertisement -

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాణ సంస్థ ఆర్కే టెలీ షో స్థాపించి 25 ఏళ్లవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాష్‌ను హీరోగా పరిచయమవుతున్న“సర్కారు నౌకరి” సినిమా టీజర్ విడుదల చేశారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భావనా వళపండల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఆర్కే టెలీ షో 25 ఏళ్ల వేడుకలో నిర్మాతలు సురేష్ బాబు, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, టీజీ విశ్వప్రసాద్, ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ‘కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందకు ఆర్కే టెలీ ఫిలింస్ స్టార్ట్ చేశాను. ఈ వేదిక మీదున్న చాలా మంది పెద్ద ప్రొడ్యూసర్స్ నా సినిమాలు చూసి ఇన్స్ పైర్ అయ్యామని చెబుతున్నారు. మీరు చాలా పెద్ద సినిమాలు చేస్తున్నారు. అప్పుడప్పుడు చిన్న సినిమాలు చేసి కొత్త టాలెంట్‌కు అవకాశాలు ఇస్తే ఇన్నేళ్లుగా నేను చేసిన ప్రయత్నానికి కొనసాగింపుగా ఉంటుంది. మా సంస్థలో ఎంతోమంది యంగ్ టాలెంట్ ఉన్నారు.

మీరు చేసే చిన్న సినిమాల్లో వారికి అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తున్నా’ అన్నారు. దర్శకుడు గంగనమోని శేఖర్ మాట్లాడుతూ ‘ఆహా ఓటీటీలో నేను పంచతంత్ర కథలు అనే వెబ్ సిరీస్ చేశాను. అయితే ఒకరోజు రాఘవేంద్రరావు గారు ఫోన్ చేసి ఆయన ఆఫీస్ కు రమ్మని పిలిచారు. వెళ్లి కలిస్తే నేను పంచతంత్ర కథలు ఎలా మొదలుపెట్టి ఎలా ఎండ్ చేశానో చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. మనం చేసే ప్రయత్నం నిజాయితీగా ఉంటే అది ఎక్కడికైనా చేరుతుంది అని అర్థమైంది. ఒక లైన్ కథ వినిపిస్తే ఆయనకు నచ్చింది. వెంటనే మా సంస్థలో చేద్దామని అన్నారు. నాకు సర్కారు నౌకరి సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు రాఘవేంద్రరావు గారికి థాంక్స్ చెబుతుతున్నా’ తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగర్ సునీత, హీరోయిన్ భావన వళపండల్, హీరో ఆకాష్, రైటర్ బీవీఎస్ రవి, సంగీత దర్శకుడు శాండిల్య, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News