Monday, December 23, 2024

పాటలు కూడా పాన్ ఇండియా అయిపోయాయి

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ’సర్కారు వారి పాట’ ఆల్బమ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. సంగీత సంచలనం ఎస్.ఎస్. తమన్ స్వరకల్పనలో ఇప్పటికే విడుదలైన కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్ అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని టాప్ ట్రెండింగ్ వున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘సర్కారు వారి పాట’ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

మా కష్టం వృధా కాలేదు…

సినిమాలోని ‘కళావతి’ పాటకు ఒకటే వర్షన్ చేశాం. 2020 లాక్‌డౌన్‌లో చేసిన పాట ఇది. నేను, దర్శకుడు పరశురాం, గీత రచయిత అనంత శ్రీరామ్ జూమ్ కాల్ మాట్లాడుతూ సినిమాలోని హీరోయిన్ పేరుతో అనుకున్న ఫస్ట్ లైన్ ఇది. నాకు ‘సామజవరగమనా’, దర్శకుడు పరశురాంకి ‘ఇంకేం ఇంకేం కావాలె’ లాంటి మేలోడిస్ ఉన్నాయి. ఇక మహేష్ బాబు చాలా కాలం తర్వాత హీరోయిన్ పాత్రని ఉద్దేశించి పాడుతున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇది. అయితే పాట కంపోజ్ చేసి రెండేళ్ళు దాటిపోయింది. ఈ గ్యాప్‌లో పాటకు రోజు ప్రాణం పోస్తూ చివరిగా రిలీజ్ చేశాం. మా కష్టం వృధా కాలేదు. ఫాస్టెస్ట్‌గా 150 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసి ‘కళావతి’ పాట అందరినీ అలరించింది.

అన్నీ చూసి రిలీజ్ చేస్తాం…

ఆల్బంలోని పాటల్లో ఏది ముందుగా విడుదల చేయాలని ఆలోచిస్తాం. మా సినిమానే కాకుండా ఆ సమయానికి బయట సినిమాల్లో ఎలాంటి పాటలు వస్తున్నాయనేది కూడా చూస్తాం. కళావతి పాట విడుదలకి ముందు డీజే టిల్లు, లాలా భీమ్లా నాయక్, బీస్ట్ పాటలు ట్రెండింగ్‌లో వున్నాయి. ఈ మూడు పాటలు కూడా లౌడ్ మాస్ సాంగ్స్. అలాంటి సమయంలో మెలోడి సాంగ్ అయితే బెస్ట్ అని భావించి కళావతి పాట రిలీజ్ చేశాం.

ఆ బాధ్యతలన్నీ తీసుకోవాల్సి వస్తుంది…

లిరికల్ వీడియోకి భారీగా ఖర్చు పెట్టడానికి ఆడియో కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. పాట బాలేకపోతే వారు పెట్టుబడి పెట్టరు. వాళ్లకి కూడా కొన్ని లెక్కలు, టీమ్ వుంటుంది. అందరూ ఓకే చేయనిదే అంతంత బడ్జెట్లు రావు. పెట్టుబడికి తగిన రాబడి వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటారు. 150 మిలియన్ వ్యూస్ సాధించడం అంత తేలిక విషయం కాదు. సినిమాలే కాదు పాటలు కూడా పాన్ ఇండియా అయిపోయాయి. ఒక పాట రీచ్ అవాలంటే.. అది గ్లోబల్‌గా ఉందా ? ఎవరు పాడుతున్నారు ? ఇలా చాలా అంశాలు వుంటాయి. ఈ బాధ్యతలన్నీ తీసుకోవాల్సి వస్తుంది.

ఆరోగ్యకరమైన పోటీ…

మంచి మ్యూజిక్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే అంచనాలు, వత్తిడిని భరించగలడా? అనేది కూడా చూస్తున్నారు. దర్శకుడు, హీరో, ఫ్యాన్స్ .. ఇలా అందరూ మ్యూజిక్ తప్పు ఒప్పులు చెబుతుంటారు. దీంతో పాటు మిగతా భాషల పాటలతో కూడా పోటీ వుంటుంది. అయితే ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీ వుంటే మంచిది. ఈ వత్తిడి కూడా ఓ మంచి పాటని ఇవ్వడానికి అడ్వాంటేజ్ గా వుంటుంది.

పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్…

మల్టీ ప్రాజెక్ట్ చేస్తూ అంచనాలు అందుకోవడం చాలా కష్టం. దీని కోసం బ్రెయిన్‌తో పాటు పరిగెత్తాలి.అయితే ఇప్పుడు మంచి విషయం ఏమిటంటే.. డిఫరెంట్ కథలతో సినిమాలు వస్తున్నాయి. దీంతో ఒకేలా కాకుండా డిఫరెంట్‌గా అలోచించే అవకాశం వుంది. జోనర్స్ మారడం వలన మ్యూజిక్ కూడా డిఫరెంట్ జోనర్స్‌లో వస్తుంది. ‘సర్కారు వారి పాట’ విషయానికి వస్తే ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా. సినిమా మొత్తం స్పార్క్ తగ్గనే తగ్గదు. సినిమా అంతా షైనింగ్ కనిపిస్తూనే వుంటుంది. ఈ సినిమా పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News