Friday, November 15, 2024

‘సర్కారు వారి పాట కోసం’ మూడు బ్యాంక్‌ల సెట్స్

- Advertisement -
- Advertisement -

Sarkari vari songs download
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ విడుదలకు సిద్దమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మే 12న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు పనిచేసిన స్టార్ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ మీడియాతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ “దర్శకుడు పరశురాం మొదట కథ చెప్పినపుడు ఇది పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ అనిపించింది.

చాలా పెద్ద యాక్షన్, ఎంటర్‌టైనర్ అవుతుందని డైరెక్టర్‌కి అప్పుడే చెప్పా. ఆ తర్వాత పని చేయడం మొదలుపెట్టా. మహేష్ బాబుతో ఇది 7వ సినిమా. సెట్స్‌లో ఆయన చాలా సరదాగా వుంటారు. అదే సమయంలో టెక్నిషియన్ నుంచి అవుట్ పుట్ కూడా అద్భుతంగా రాబట్టుకుంటారు. ఈ సినిమాలో మహేష్ బాబు నెక్స్ లెవెల్‌లో కనిపిస్తారు. ఆయన సెట్‌లో డ్యాన్స్ చేస్తుంటే విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. ‘సర్కారు వారి పాట’ స్టొరీ పాయింట్ బ్యాంక్ నేపధ్యంలో వుంటుంది. దీని కోసం మూడు బ్యాంక్‌లు అవసరమయ్యాయి.

అందులో ఒకటి 50 ఏళ్ళ క్రితం బ్యాంక్ ఎలా వుంటుంది ? అనే దానిపై స్టడీ చేసి, వింటేజ్ లుక్‌లో డిజైన్ చేసి, అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేశాం. ఇది ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తుంది. అలాగే మరో రెండు మోడ్రన్ బ్యాంక్‌ల సెట్స్ వేశాం. ఈ సినిమాలో బ్యాంక్ కాకుండా దాదాపు ఎనిమిది సెట్స్ వేశాం. అలాగే ఒక వీధి సెట్ కూడా వుంది. చాలా ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ డిజైన్ చేశాం. ఇక ప్రస్తుతం చిరంజీవితో ‘భోళాశంకర్’, చిరంజీవి, డైరెక్టర్ బాబీల మూవీ, బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమా, త్రివిక్రమ్-, మహేష్ బాబు మూవీ, వెంకటేష్,- వరుణ్ తేజ్‌ల ‘ఎఫ్ 3’ సినిమాలకి పని చేస్తున్నా”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News