Thursday, January 23, 2025

రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్

- Advertisement -
- Advertisement -

Sarkaru vaari paata shooting wrapped up

 

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ’సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అంచనాలని మరో స్థాయికి తీసుకెళ్లింది థియేట్రికల్ ట్రైలర్. ఇక ‘సర్కారు వారి పాట’ ప్రీ -రిలీజ్ ఈవెంట్ డేటుని ఖరారు చేసింది చిత్ర యూనిట్. శనివారం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ‘సర్కారు వారి పాట’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.

సాయంత్రం 6 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభమవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు చిత్ర యూనిట్ మొత్తం పాల్గొంటున్న ఈ ఈవెంట్‌లో ప్రేక్షకులకు చాలా సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నాయి. బ్లాక్‌బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మ్యూజికల్ సెన్సేషన్ ఎస్‌ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మే 12న విడుదలకు సిద్దమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News