Wednesday, January 22, 2025

కుల వృత్తులకు సర్కార్ చేయూత

- Advertisement -
- Advertisement -

జడ్చర్ల : తెలంగాణ ప్రభుత్వం కుల వృత్తులకు చేయూతనందిస్తుందని, గొల్ల కురుమలను ఆర్ధికంగా ఆదుకునేందుకు సబ్సిడీపై గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాల్టీ పరిధిలోని చంద్ర గార్డెన్ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కులవృత్తులను ప్రోత్సహించి గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల నుంచి రూపొందినదే గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమం అని పేర్కొన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జడ్చర్ల నియోజకవర్గంలో రూ. 72 కోట్లతో 4,119 మంది లబ్దిదారులకు 86,499 గొర్రెలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాజాపూర్‌కు 12 యూనిట్లు, బాలానగర్‌కు 12 యూనిట్లు చొప్పున పంపిణీ చేశారు.

గొర్రెల పెంపకం వృత్తిగా జీవనం సాగిస్తున్న గొల్ల, కురుమలు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే ఆలోచనతో ఈ పథకానికి స్వయంగా కెసిఆర్ రూపకల్పన చేశారన్నారు. మొదటి విడతలో నియోజకవర్గంలో రూ. 50 కోట్లతో 4037 మంది లబ్ధిదారులకు 84,777 గొర్రెలను పంపిణీ చేసినట్లు తెలిపారు. జడ్పి వైస్ చైర్మన్ తోడుగల్ యాదయ్య, మున్సిపల్ చైర్మన్ లక్ష్మి రవీందర్, కౌన్సిలర్ ఉమా శంకర్‌గౌడ్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు దొరేపల్లి రవీందర్, శ్రీశైలం, నర్సిములు, రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News