Monday, December 23, 2024

మహేష్ బాబు ప్రభంజనం సృష్టించారు

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి బ్లాక్‌బస్టర్ స్పందన రావడం ఆనందంగా వుంది. ఈ సినిమాతో మహేష్ బాబు ప్రభంజనం సృష్టించారు”అని అన్నారు దర్శకుడు పరశురాం. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించిన ‘సర్కారు వారి పాట’ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించిన నేపథ్యంలో చిత్ర యూనిట్ బ్లాక్‌బస్టర్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో దర్శకుడు పరశురాంతో పాటు నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ పాల్గొని మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా దర్శకుడు పరశురాం మాట్లాడుతూ “మొదటి ఆట నుండే సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన రావడం ఆనందంగా వుంది. సూపర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్, ఫ్యామిలీ ఆడియన్స్, మాస్, క్లాస్… ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు ‘సర్కారు వారి పాట’ నచ్చింది. ఇక ‘సర్కారు వారి పాట’ ప్రజలందరికీ కనెక్ట్ అయ్యే కథ. బ్యాంకింగ్ సెక్టార్, ఈఎంఐ తో ఇబ్బంది పడని మిడిల్ క్లాస్ మనిషి వుండరు. అలాంటి పాయింట్‌ని మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్‌తో చెప్పించడం సినిమాకి ప్లస్ అయింది.

ఇలాంటి కథ రాయడం రచయిత, దర్శకుడిగా నాకూ ఒక తృప్తిని ఇచ్చింది. ‘సర్కారు వారి పాట’ని ఘన విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు”అని తెలిపారు. నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ “ఇంత ఘన విజయం ఇచ్చిన మా హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్‌లకు చాలా కృతజ్ఞతలు. మా బ్యానర్‌లో అద్భుతమైన స్పందన వచ్చిన మూవీ ‘సర్కారు వారి పాట’. ఫ్యాన్స్‌కి ఈ సినిమా ఫుల్ మీల్స్‌లా వుంది. ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ డేనే కాదు. ఈ రెండు వారాలు భారీ కలెక్షన్స్ సాధించబోతుంది. యూఎస్ ప్రీమియర్ మిలియన్ డాలర్స్‌ని కలెక్ట్ చేసి నాన్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ రికార్డులన్నీ క్రాస్ చేసింది. అదే స్థాయిలో ఇక్కడ కూడా కలెక్షన్స్ కొనసాగుతున్నాయి”అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News