Monday, December 23, 2024

అన్నీ కొత్తగా, వినోదాత్మకంగా ఉంటాయి

- Advertisement -
- Advertisement -

Sarkaru Vaari Paata Pre Release Event

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దిన ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మైత్రీ మూవీమేక ర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగింది. ఈ వేడుకలో సూపర్‌స్టార్ మహేష్ బాబు, చిత్ర యూనిట్‌తో పాటు ప్రముఖ దర్శకులు సుకుమార్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ… ‘దర్శకుడు పరశురాం సర్కారు వారి పాటలో నా పాత్రని అద్భుతంగా డిజైన్ చేశారు. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ అన్ని కొత్తగా, వినోదాత్మకంగా ఉంటాయి. కొన్ని సీన్లు చేస్తున్నపుడు ‘పోకిరి’ రోజులు గుర్తుకు వచ్చాయి. సర్కారు వారి పాటలో చాలా హైలెట్స్ ఉం టాయి. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కోసం రిపీట్ ఆడియన్స్ వస్తారు. కీర్తి సురేష్ పాత్ర అద్భుతంగా ఉంటుంది. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ యాక్షన్ సీన్లను అద్భుతంగా డిజైన్ చేశారు’ అని అన్నారు.

దర్శకుడు పరశురాం మాట్లాడుతూ… ‘మహేష్ బాబుకి మొదట కథ చెప్పినపుడు భయం వేసింది. ఐదు నిమిషాల తర్వాత మహేష్ ముఖంపై ఒక నవ్వు కనిపించింది. ఆ నవ్వే ఇక్కడి వరకూ తీసుకొచ్చింది. నా విజన్ తెరపై చూపించడానికి ఎక్కడా రాజీ పడకుండా సినిమాని నిర్మించిన మైత్రీ మూవీమేకర్స్, జీఏంబీ ఎంట ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ నిర్మాతలకు, డీవోపి మధి, ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్, తమన్, రామ్‌లక్ష్మణ్, మార్తాండ్ కే వెంకటేష్, అనంత శ్రీరామ్‌లకు ధన్యవాదాలు’ అని తెలిపారు. హీరోయిన్ కీర్తి సురేష్ మాట్లాడుతూ… ‘కళావతి పాత్రను అద్భుతంగా చిత్రీకరించిన కెమారామెన్ మధి, అద్భుతమైన పాటలు ఇచ్చిన తమన్‌కి ధన్యవాదాలు. మహేష్‌తో వర్క్ చేసినప్పుడు ఆయన ఎనర్జీ, టైమింగ్ మ్యాచ్ చేయడానికి టెన్సన్ పడ్డా. ఆయతో పని చేయడం గౌరవంగా భావిస్తున్నా’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు నవీన్ యెర్నేని, రామ్ ఆచంట, తమన్, అనంత శ్రీరామ్, సముద్రఖని, ఆది శేషగిరిరావు, సుధీర్ బాబు, గల్లా అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Sarkaru Vaari Paata Pre Release Event

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News