Tuesday, January 21, 2025

ఊహించినట్లే ఘన విజయం సాధించింది

- Advertisement -
- Advertisement -

geetha govindam director parasuram

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ’సర్కారు వారి పాట’ను బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ‘సర్కారు వారి పాట’ దర్శకుడు పరశురాం మీడియాతో మాట్లాడుతూ “ఈ సినిమా కథ అనుకున్నప్పుడే మహేష్ బాబు కెరీర్‌లో పెద్ద హిట్ కావాలని భావించాం.

దానికి తగ్గట్టే క్యారెక్టర్, మేనరిజమ్స్, లుక్స్ డిజైన్ చేశాం. మేము ఊహించినట్లే సినిమా ఘన విజయం సాధించింది. కొత్త మహేష్ బాబుని చూస్తున్నామనే ఫీడ్ బ్యాక్ అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి వచ్చింది. సినిమా ఇంతపెద్ద ఘన విజయం సాధించినందుకు చాలా ఆనందంగా వుంది. దర్శకులు సుకుమార్, హరీష్ శంకర్, పూరి జగన్నాథ్ కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుని డైరెక్ట్ చేశాననేది నా మొదటి కిక్కు. సినిమా బ్లాక్‌బస్టర్ కావడం సెకండ్ కిక్. మహేష్‌ని కొత్తగా చూపించారని ఫ్యాన్స్ ఆనందపడటం థర్డ్ కిక్‌”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News