సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’. వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో దూకుడు మీదున్న మహేష్ బాబు, అటు సూపర్ ఫామ్‌లో ఉన్న దర్శకుడు పరశురామ్ కలయికలో వస్తున్న ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మ్యూజికల్ సెన్సేషన్ ఎస్‌ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని రెండు పాటలు కళావతి, పెన్నీ.. ఇప్పటికే చార్ట్‌బస్టర్స్ గా నిలిచాయి. తాజాగా ఈ మూవీ టైటిల్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టైటిల్ సాంగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘సర్కారు వారి పాట’ మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Sarkaru Vaari Paata Title song released