Sunday, December 22, 2024

ట్రైలర్ కంటే సినిమా వందరెట్లు అద్భుతంగా…

- Advertisement -
- Advertisement -

Sarkaru vari pata theatrical trailer release

 

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఈనెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘సర్కారు వారి థియేట్రికల్’ ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని బ్రమరాంభ థియేటర్‌లో ఫ్యాన్స్ కోలాహలం మధ్య విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పరశురాం మాట్లాడుతూ “ట్రైలర్‌కి ఫ్యాన్స్ నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే హ్యాపీగా వుంది. ట్రైలర్ కంటే సినిమా వందరెట్లు అద్భుతంగా ఉంటుందని ప్రామిస్ చేస్తున్నా”అని అన్నారు.

నిర్మాత నవీన్ యెర్నేని నవీన్ మాట్లాడుతూ ఈనెల 12న అందరూ థియేటర్‌లో సినిమా చూసి ఎంజాయ్ చేయండని చెప్పారు. ఇక మహేష్ బాబు అభిమానులకు పండగ లాంటి సినిమా ‘సర్కారు వారి పాట’ అని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. హైవోల్టేజ్ యాక్షన్,. గ్రాండ్ విజువల్స్…. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే డైలాగ్స్‌తో సంచలనం సృష్టించింది సర్కారు వారి పాట ట్రైలర్. ట్రైలర్‌లో మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్ అండ్ స్టైలిష్‌గా కనిపించారు. అదే సమయంలో మాస్ యాక్షన్‌తో అదరగొట్టారు.

దర్శకుడు పరశురాం మహేష్ బాబుని సరికొత్తగా చూపించి అభిమానులని అలరించారు. మహేష్ బాబుతో కీర్తి సురేష్ జోడి లవ్లీగా వుంది. ఎస్‌ఎస్ తమన్ ట్రైలర్ కోసం చేసిన బీజీఏం స్కోర్ గ్రాండ్‌గా వుంది. విజువల్స్ లావిష్‌గా వున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News