- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: నిజామాబాద్ బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్‌పై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సిఎం కెసిఆర్‌ను పరుష పదజాలంతో దూషించడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఎంపి అరవింద్ వ్యాఖ్యానించారని అడ్వకేట్ రవి కుమార్ సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. నాంపల్లిలోని బిజెపి ఆఫీసులో జులై 13న ఎంపి అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ సిఎం కెసిఆర్‌ణు దూషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపి దూషించిన వ్యాఖ్యలకు సంబంధించిన యూట్యూబ్ వీడియో క్లిప్‌లను కూడా పోలీసులకు అందించారు. ఈ మేరకు పోలీసులు ఎంపి అర్వింద్‌పై ఐపిసి సెక్షన్ 504, 505(1) సి కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Saroor Nagar Police case filed against MP Aravind
- Advertisement -