Wednesday, January 22, 2025

సర్పంచ్ నిధులు దారి మళ్లింపు: వైవిబి రాజేంద్ర ప్రసాద్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడంలేదని వైవిబి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కేంద్ర మంత్రి కపిల్ హోరేశ్వర్ పటేల్‌ను ఎపి సర్పంచులు కలిశారు. నిధుల మళ్లింపుపై కేంద్రమంత్రికి ఎపి సర్పంచులు ఫిర్యాదు చేశారు. పంచాయతీ నిధుల మళ్లింపుపై విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కపిల్ మోరేశ్వర్ పటేల్‌ను ఎపి సర్పంచులు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు ఇవ్వడం లేదని, కేంద్రం నిధులను దారి మళ్లిస్తున్నారని వైవిబి పేర్కొన్నారు. దాదాపు వేల కోట్లు దారి మళ్లించారని, ఉపాధి హామీ పథకం కింద దాదాపు రూ.35 వేల కోట్లు దుర్వినియోగం చేశారని వివరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని వైవిబి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.

సర్పంచులు ఆందోళన చెందవద్దని కేంద్రమంత్రి మోరేశ్వర్ పటేల్ తెలిపారు. అన్ని విషయాలు పరిశీలిస్తామని, గ్రామ పంచాయతీల కోసం ఇచ్చిన నిధులను వారి కోసమే ఖర్చు చేయాలని, నిధుల మళ్లింపుపై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామని సర్పంచులకు కేంద్రమంత్రి కపిల్ హామీ ఇచ్చారు.

Also Read: మనిషిని పోలిన ఎలుగుబంటి(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News