Wednesday, January 22, 2025

మానవత్వం చాటుకున్న సర్పంచ్‌

- Advertisement -
- Advertisement -

తలకొండపల్లి: ఇల్లు లేని నిరుపేద వృద్ధురాలికి సర్పంచ్ మానవత్వంతో అండగా నిలిచిన సంఘటన మండల పరిధిలోని దేవుని పడకల్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దాస బాలమణి అనే వృద్ధురాలి ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది.

ఈ విషయాన్ని గుర్తించిన సర్పంచ్ శ్రీశైలం తన వంతుగా ఇంటి నిర్మాణంకోసం రూ.10,600నగదును అందజేశారు.ఆర్థిక సహాయం అందించడంపట్ల వృద్ధురాలు సర్పంచ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామస్వామి, శంకర్, రమేష్, భిక్షపతి, శ్రీను, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News