Monday, January 20, 2025

బాలికపై సర్పంచ్ భర్త లైంగిక దాడి

- Advertisement -
- Advertisement -

కడ్తాల్: సర్పంచ్ భర్త ఓ బాలిక పై లైంగిక దాడికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలం గానుగుమర్ల తాండాలో చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని ఓ తాండాకు చెందిన దంపతులు తమ 12 ఏళ్ల కూతురితో కలిసి ఉపాధి నిమిత్తం కడ్తాల మండలం గానుగుమర్ల తాండాకు వచ్చారు. దంపతులిద్దరూ తమ కూతురిని ఇంట్లోనే ఉంచి వ్యవసాయ పనులకు వెళ్లారు.

ఇదే అదునుగా భావించిన గానుగుమర్ల తాండా సర్పంచ్ భర్త నేనావత్ మోత్యనాయక్ (49) ఇంటరిగా ఉన్న బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డ విషయాన్ని ఆ బాలిక తల్లిదండ్రులకు తెలపడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు మోత్యనాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కడ్తాల పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై హరీష్‌శంకర్‌గౌడ్ తెలిపారు.

నిందితుడిని రిమాండ్‌కు తరలింపు
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని నేనావత్ మోత్య నాయక్‌ను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆమనగల్లు సిఐ జాల ఉపేందర్ తెలిపారు చర్లపల్లి జైలుకు రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News