Wednesday, January 22, 2025

మహిళలను వేధిస్తే కిరోసిన్ పోసి తగలబెడతాం: నవ్య

- Advertisement -
- Advertisement -

 

వరంగల్: చెడును తాను కచ్చితంగా ఖండిస్తానని సర్పంచ్ నవ్య తెలిపారు. ధర్మసాగర్ మండలం జానకీపురం గ్రామానికి ఎంఎల్‌ఎ రాజయ్య చేరుకున్నారు. సర్పంచ్ నవ్య కుటుంబ సభ్యులను రాజయ్య కలిశారు. ఈ సందర్భంగా నవ్య మీడియాతో మాట్లాడారు. ఎవరికైనా పార్టీలో విలువ ముఖ్యమని, ఎంఎల్‌ఎ రాజయ్య వల్లే తాను సర్పంచ్‌ను కాగలిగానని, రాజకీయాల్లో అణచివేతలు, వేధింపులు ఉండొద్ధని హెచ్చరించారు. మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడితే సహించేదే లేదని, పార్టీలో ఏ స్థాయిలో ఉన్న మహిళలకైనా గౌరవం ముఖ్యమని నవ్య చెప్పారు. తమకు దక్కాల్సిన గౌరవం దక్కకుంటే సహించేదే లేదన్నారు. మహిళలపై అరాచకాలు జరిగితే సహించేదే లేదని, మహిళలను వేధిస్తే కిరోసిన్ పోసి నిప్పంటించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News