Sunday, December 22, 2024

వ్యక్తిపై సర్పంచ్ కుమారుడు బ్లేడ్‌తో దాడి.. తెగిపడిన చెవి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పివిపాలెం మండలం సంగుపాలెంలో సర్పంచ్ కుమారుడు వీరంగం సృష్టించారు. శ్రీనివాస్ రావు అనే వ్యక్తిపై సర్పంచ్ కుమారుడు మహేష్ బ్లేడ్‌తో దాడి చేశాడు. శ్రీనివాస రావు భార్య క్రాంతిపథం యానిమేటర్‌గా పనిచేస్తున్నారు. ఎంఎల్‌ఎ పెట్టిన ఆసరా సభకు క్రాంతి పథం సభ్యులతో యానిమేటర్‌గా శ్రీనివాస్ వెళ్లాడు. తమకు చెప్పకుండా మీటింగ్ వెళ్తారా అంటూ ఆగ్రహంతో మహేష్‌పై దాడి చేయడంతో శ్రీనివాసరావు చెవి తెగిపడింది. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సర్పంచ్ కుమారుడు మహేష్ పొన్నూరు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News