Monday, December 23, 2024

నేటితో ముగియనున్న సర్పంచ్‌ల పదవీకాలం.. హైకోర్టులో పిటిషన్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: తెలంగాణలో సర్పంచ్‌ల పదవీకాలం బుధవారంతో ముగియనుంది. ఈ క్రమంలో సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికలు జరిగే వరకు సర్పంచ్‌లుగా తమనే కొనసాగించాలని హైకోర్టులో పిటిషన్‌ వేసింది. లేకపోతే తమ పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని కోరింది.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో సర్పంచ్‌లు చేసిన అభివృద్ధి పనుల బిల్లులను చెల్లించలేదు. అప్పులు తీసుకువచ్చి సర్పంచ్‌లు అభివృద్ధి పనులను చేపట్టారు. గత ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో సర్పంచ్‌లు అప్పులపాలయ్యారు. ఇప్పటికే కొందరు సర్పంచ్‌లు ఆత్మహత్య కూడా చేసుకున్న సంగతి తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News