Monday, January 20, 2025

మల్టీ పర్పస్ వర్కర్‌గా మారిన సర్పంచ్

- Advertisement -
- Advertisement -

మునుగోడు: గ్రామ పంచాయతీ కార్మికుల నిరవధిక దీక్షల నేపధ్యంలో మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మిర్యాల వెంకటేశ్వర్లు మంగళవారం మల్టీ పర్పస్ వర్కర్ అవతారమెత్తారు. ఆరు రోజుల నుంచి గ్రామపంచాయతీ సిబ్బంది దీక్షలో పాల్గొనడంతో మేజర్ గ్రామ పంచాయతీలో ఎక్కడికక్కడ చెత్త చెదారం పేరుకుపోయింది.

ఇదే సమయంలో వర్షం కురవడంతో రోడ్లన్నీ చెత్తతో కూడిన బురదతో నిండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాగా సర్పంచ్ ప్రత్యామ్నాయ సిబ్బందితో పని చేయించాలనుకున్నా సాధ్యపడకపోవడంతో తానే స్వయంగా గ్రామపంచాయతీ ట్రాక్టర్ నడుపుతూ ఇండ్ల నుంచి చెత్తను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.సమ్మె ఇలాగే కొనసాగితే ప్రస్తుతం వర్షాకాల సీజన్ అయినందున సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News