- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ సర్పంచుల సంక్షేమ సంఘం నేతలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును గురువారం కలిశారు. పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని సర్పంచుల సంఘం మంత్రిని కోరింది. పంచాయతీలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి బకాయిలు లేదని ఎర్రబెల్లి తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ.11,140 కోట్ల ఉపాధి హామీ బకాయిలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కేంద్రం నుంచి నిధులు రాగానే సిసి రోడ్ల బకాయిలు విడుదల చేస్తామని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. పల్లె ప్రగతిలో సర్పంచుల పాత్ర అమోఘమని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. సర్పంచులకు బీమా విషయాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పల్లె ప్రగతి తర్వాత సర్పంచుల విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.
- Advertisement -