Saturday, November 2, 2024

సర్పంచ్‌లకు అడవి పందులను కాల్చివేసే అధికారం

- Advertisement -
- Advertisement -

Sarpanches can now order killing of wild boar in Telangana

హైదరాబాద్ : పంటలను నాశనం చేస్తున్న అడవి పందుల బెడదను తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లను వన్యప్రాణుల గౌరవ సంరక్షణాధికారులుగా నియమిస్తూ అటవీశాఖ ఉత్వర్వులు జారీ చేసింది. అంతే కాకుండా అడవిపందుల బెడద తీవ్రతను బట్టి వాటిని కాల్చివేసేందుకు అవసరమైన అనుమతులను షూటర్లకు ఇచ్చే అధికారాన్ని కూడా ప్రభుత్వం సర్పంచ్‌లకు అప్పగించింది. అడవులు అధికంగా ఉండే అదిలాబాద్ , నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, నాగర్ కర్నూల్ తదితర జిల్లాలతో పాటు చిట్టడవులు ఉండే ప్రాంతాల్లో అడవి పందుల సంచారం అధికంగా ఉంది. అడవులకు సమీపాన ఉండే పరిసర గ్రామాల్లో రైతులు సాగుచేసిన ఉద్యాన పంటలలతో పాటు వేరుశనగ తదితర నూనె గింజ పటలకు అడవి పందుల బెడద అధికంగా ఉంది. పంటలను కాపాడుకోలేక రైతులు నష్టపోతున్నారు.

Sarpanches can now order killing of wild boar in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News