Tuesday, December 24, 2024

బిఆర్‌ఎస్ పార్టీకి సర్పంచ్‌లు రాజీనామా

- Advertisement -
- Advertisement -

చిట్యాలః మండలంలోని జడలపేట, నవాబుపేట సర్పంచ్‌లు కామెడీ రత్నాకర్‌రెడ్డి, కసిరెడ్డి సాయిసుధలు బిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు వారి రాజీనామా పత్రాలను జిల్లా, మండల అధ్యక్షుడికి అందజేయనున్నట్లు తెలిపారు. కాగా గత కొన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ నాయకుల రాజీనామాతో మండల వ్యాప్తంగా చర్చలు ఊపందుకున్నాయి. అయితే ఏ పార్టీలో చేరుతారో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కొంత మంది రాజకీయ నాయకులు తెలిపిన సమాచారం మేరకు సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని సమాచారం. అయితే బిఆర్‌ఎస్ పార్టీలోని అగ్రశ్రేణి నాయకులతో ఎలాంటి అభిప్రాయ బేధాలు లేవని వారు లేఖలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News