Monday, January 20, 2025

డ్రైవర్ ప్రేమలో సర్పంచ్ కూతురు.. రైల్వేట్రాక్‌పై శవాలు

- Advertisement -
- Advertisement -

Sarpanch's daughter in driver's love.. Dead bodies on railway track

కలకలం రేపుతున్న పరువు హత్యలు

పాట్నా : కింది స్థాయి వ్యక్తిని ప్రేమించిందనే కారణంగా సొంత కూతురినే తల్లి, ఆమె అనుచరులు చంపేశారు. ప్రేమికుడితోపాటు కన్న కూతురి శవాలను రైల్వేట్రాక్‌పై పడేశారు. ఆ తరువాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. బీహార్ లోని బెగుసరాయ్ జిల్లాలో ఈ సంఘటన కలకలం సృష్టించింది. యువకుడు సర్పంచ్ ఇంట్లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, ఇరువురు ప్రేమించుకున్నారనే కోపం తోనే యువతి తల్లిదండ్రులు పరువుహత్యలకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. యువకుడు రాజపుర్ దుమీ ప్రాంతానికి చెందిన రామ్‌నునుపాశ్వాన్ (25). యువతి అయోధ్య బారీ గ్రామ సర్పంచ్ కూతురు రూపమ్ కుమారిగా గుర్తించారు. గ్రామస్థులు ఆందోళన చేపట్టడంతో గ్రామ సర్పంచ్ అయిన యువతి తల్లి అనితాదేవి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. వారి ప్రేమ ఇష్టం లేనందునే అనితా దేవి ఈ హత్యలు చేసినట్టు గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాక్టర్‌లో ఇసుక దించడానికి సాయం చేయాలన్న నెపంతో యువకుడిని పిలిపించి సర్పంచ్ ఆమె అనుచరులు హత్య చేసినట్టు బయటపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News