Thursday, January 23, 2025

అప్పు చెల్లించలేదని ఇంటికి తాళం వేసిన సర్పంచ్ భర్త

- Advertisement -
- Advertisement -

ఇచ్చోడ : తీసుకున్న అప్పు ఎందుకు చెల్లించడం లేదంటూ అధికార పార్టీకి చెందిన సర్పంచ్ భర్త బాధితుడి ఇంటికి తాళం వేసిన అమానుష సంఘటన సంచలనం రేకెత్తించింది. దీంతో బాధితులు సోమవారం రాత్రంతా ఇంటి ఆవరణలో చీకట్లో బిక్కు బిక్కుమంటూ పడుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి … సిరిచెల్మ గ్రామానికి చెందిన రాజేశ్వర్ వద్ద అదే గ్రామానికి చెందిన తిట్ర శ్రీనివాస్ అనే వ్యక్తి పాలేరుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కుటుంబ అవసరం నిమిత్తం యజమాని వద్ద రూ. 24 వేల అప్పు తీసుకున్నాడు. యజమాని వద్ద ఉన్న ఎడ్లు వ్యవసాయానికి సహకరించకపోవడంతో వాటిని మార్చి వేరే జత ఎడ్లను కొనుగోలు చేశాడు.

అవి కూడా పని చేయకపోతుండడతో పాలేరు తిట్ర శ్రీనివాస్ పని మానేశాడు. తన వద్ద తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలంటూ పలుసార్లు ఒత్తిడి తీసుకొచ్చారు. చేసేది ఏమిలేక యజమాని రాజేందర్ సోమవారం రాత్రి గ్రామ సర్పంచ్ గుండాల లక్ష్మీ భర్త కన్నమయ్యను రాత్రి ఆ శ్రయించాడు. బాధితుడు ఇంటికి చేరుకొని ఒత్తిడి తీసుకొచ్చారు.తన వద్ద ప్రస్తుతం డబ్బు కట్టే స్తోమత లేదని చెప్పడంతో సర్పంచ్ భర్త ఇంటికి తాళం వేశారు. సమచారాం తెలుసుకున్న పోలీసులు మంగళవారం గ్రామానికి చేరుకొని తాళం తీశారు. ఈ ఘటన చర్చనీయశంగా మారింది . పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News