Wednesday, January 22, 2025

గుండె రక్తనాళాలకు సోకకుండానే సార్స్‌కొవి2 ముప్పు

- Advertisement -
- Advertisement -
SARS-CoV-2 can damage heart blood vessels
బ్రిస్టల్ యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనం

లండన్ : తీవ్ర ఆస్వస్థతకు గురైన కొవిడ్ రోగుల్లో జరిగినట్టు గా , గుండెలోని చిన్న రక్తనాళాలకు సోకకుండానే సార్స్ కొవిడ్ 2 హాని కలిగిస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. జర్నల్ క్లినికల్ సైన్స్‌లో ఈ పరిశోధన వివరాలు వెల్లడయ్యాయి. యాంటీబాడీలను అడ్డుకోవడం, హృదయ సంబంధ చిక్కులను తగ్గించే కొత్త చికిత్సను ప్రతిపాదిస్తుందని ఈ పరిశోధన సూచించింది. బ్రిటన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ బ్రిస్టల్‌కు చెందిన పరిశోధక బృందం ఈ పరిశోధన చేపట్టింది. కొవిడ్ 19 రోగుల్లో మాదిరి గానే సార్స్ కొవి 2 ఏ విధంగా గుండె కణాలతో పరస్పర అనుసంధానమై గుండెపోటు వంటి హాని కలిగిస్తాయో విశ్లేషించారు.

ఇప్పటివరకు గుండె కణాలు కరోనా వైరస్ వల్ల ఇన్‌ఫెక్షన్‌కు గురవుతాయో లేదా నష్టాన్ని కలిగిస్తాయో స్పష్టం అయ్యేది కాదు. ఎందుకంటే మన ఇమ్యూన్ కణాల నుంచి వచ్చే సైటోటాక్సిక్ రక్షణ స్పందన అత్యధికంగా ఉండడమే కారణం. ఈ స్పందనను “సైటోకైన్ స్టార్‌”్మ అని కూడా వైద్యపరంగా వ్యవహరిస్తారు. వ్యాధి నిరోధక శక్తి కలిగిన కణాలు (ఇమ్యూన్ సెల్స్) నుంచి సైటోకైన్ స్టార్మ్ వెలువడుతుంటుంది. ఈ సైటోటాక్సిక్ కణాలు సైటోకైన్స్ అనే ప్రొటోన్‌ను విడుదల చేసి ఇన్‌ఫెక్షన్‌కు గురైన కణాలపై దాడి చేసి నాశనం చేస్తాయి. గుండె కణాలు అత్యధికంగా సైటోకైన్స్‌ను ఉత్పత్తి చేస్తాయా లేదా అన్న కోణంలో కూడా ఈ పరిశోధన సాగింది. గుండెలోని చిన్న రక్తనాళాలపై ఉండే పెరిసైట్స్ పై ప్రయోగాలు చేశారు. స్పైక్ ప్రొటోన్ పెరిసైట్స్‌ను నిర్వీర్యం చేయడాన్ని గమనించారు. ఫలితంగా గుండె కణాలకు స్పైక్ ప్రొటోన్ విపరీతమైన హాని కలిగిస్తుందని గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News