- Advertisement -
జనగామ జిల్లా ప్రజలకు మంత్రి పోన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధింగానే జనగామ జిల్లాకు తక్షణమే సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని వెల్లడించారు. సోమాజిగూడా నివాసంలో తెలంగాణ రాష్ట్ర కల్లు గీతా వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ క్యాలెండర్ ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ… రాష్ట్రంలోని గౌడలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు. వైన్ షాపుల కేటాయింపుల్లో 25 శాతం గౌడన్నలకే రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందన్న మంత్రి పోన్నం బిసిల సంక్షేమానికి రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు.
- Advertisement -