Saturday, April 12, 2025

మంచి ఫీల్‌గుడ్ సినిమా

- Advertisement -
- Advertisement -

నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, జాతీయ ఉత్తమ నటి అర్చన కాంబినేషన్‌లో రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘షష్టి పూర్తి’ . పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మేస్ట్రో’ ఇళయరాజా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇందులో తొలిపాటను ఆస్కార్ విన్నర్ కీరవాణి రచించగా ఇటీవల విడుదల చేశారు. సంచలన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ విడుదల చేసిన ఈ పాటకు అద్భుతమైన స్పందన లభించింది. రెండో పాటను మాస్ మహారాజా రవితేజ ఆవిష్కరించి, యూనిట్ కి బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ “మా రాజేంద్రప్రసాద్ అన్నయ్య ‘షష్టి పూర్తి’ చూడండి.. తప్పకుండా బావుంటుంది. మంచి ఫీల్ గుడ్ సినిమా అవుతుందనిపిస్తోంది”అని అన్నారు. దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ “సినిమాలో చాలా అందమైన యుగళ గీతం ఇది. ఇళయరాజా బాణీ ఇవ్వగానే నాకు ‘సాగర సంగమం’లో ‘మౌనమేలనోయి’ పాటలాంటి గొప్ప పాట అవుతుందనే అనుభూతి కలిగింది”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News