చెన్నై: తమిళనాడులో శశికళకు మరో షాక్ తగిలింది. దాదాపు నాలుగు సంవత్సరాలపాటు జైలు జీవితం గడిపి ఇటీవల బయటకొచ్చిన శశికళ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనుందని అందరూ భావించారు. కానీ, శశికళ అనూహ్యంగా రాజకీయాల నుంచి తప్పుకుంది. ఇప్పుడు ఏకంగా ఓటరు జాబితాలో శశికళ పేరు గల్లంతైంది. దీంతో మంగళవారం తమిళనాడులో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలో చిన్నమ్మ ఓటు వేసే అవకాశం కోల్పోయింది. పోలింగ్‌కు ఒక్కరోజు ముందు ఈ విషయం వెలుగులోకి రావడం తమిళనాడులో వివాదాస్పదంగా మారింది. శశికళను రాజకీయాల నుంచి తప్పించడమే కాకుండా ఓటు వేసే అవకాశం కూడా ఇవ్వడంలేదని చిన్నమ్మ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై శశికళ మేనల్లుడు ఎఎంఎంకె అధినేత టిటివి దినకరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ముఖ్యమంత్రి పళనీ స్వామి బాధ్యత వహించాలని మండిపడ్డారు. శశికళ ఓటు వేయకుండా ఏఐఏడిఎంకె కుట్ర చేసిందని ఆయన ఆరోపించారు. కాగా, పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయాన్ని మెమోరియల్ గా ప్రభుత్వం మర్చడంతో ఈ సమస్య వచ్చినట్లు తెలుస్తోంది.
Sasikala’s name missing from Voter list