Wednesday, January 22, 2025

ముకేశ్ అంబానీపై సెబీ ఆదేశాలను తోసిపుచ్చిన శాట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నవీ ముంబై సెజ్, ముంబై సెజ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీకి సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్(శాట్) పెద్ద ఊరటనిచ్చింది. ఈ సంస్థలకు వ్యతిరేకంగా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఇచ్చిన ఆర్డర్‌ను శాట్ రద్దు చేసింది. రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ షేర్లలో అవకతవకలకు సంబంధించిన కేసులో 2021 సంవత్సరంలో ముకేశ్ అంబానీ, రెండు సెజ్‌లపై ఈ పెనాల్టీ విధించింది. ఈ సమయంలో రిలయన్స్‌పై రూ.25 కోట్లు, అంబానీపై రూ.15 కోట్లు పెనాల్టీ విధించగా, నవీ ముంబై సెజ్‌పై రూ.20 కోట్లు జరిమానా విధించింది. దీని తరువాత అంబానీతో పాటు ఆర్‌ఐఎల్, ఇతర సంస్థలు సెబీ ఆర్డర్‌ను సవాలు చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News