Tuesday, December 24, 2024

ఆద్యంతం నవ్విస్తూ, ఉత్కంఠభరితంగా మెప్పించిన ‘సత్తిగాని రెండెకరాలు’ టీజర్‌..

- Advertisement -
- Advertisement -

తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త కంటెంట్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షోస్‌తో ఎప్ప‌టిక‌ప్పుడు ఎంట‌ర్‌టైన్మెంట్‌ను స‌రికొత్త‌గా ముందుకు న‌డిపిస్తుంది. ఇప్పుడు ఈ లిస్టులో చేరుతుంది ‘సత్తిగాని రెండు ఎక‌రాలు’ సినిమా చేరుతుంది. ఆహా, మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు క‌లిసి నిర్మించిన చిత్రం ‘సత్తిగాని రెండు ఎక‌రాలు’. అభినవ్ దండా ద‌ర్శ‌కుడు. ఈ సినిమా మార్చి 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. సోమవారం రోజున ఈ మూవీ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

‘సత్తిగాని రెండు ఎక‌రాలు’ సినిమాలో పుష్ప ఫేమ్ కేశ‌వ్ హీరోగా న‌టిస్తున్నారు. వెన్నెల కిశోర్‌, బిత్తిరి సత్తి, మోహనశ్రీ సురాగ, రాజ్‌ తిరందాసు, అనీషా దామా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల జీవితాలకు అద్దంపట్టే విధంగా కనిపిస్తోందీ టీజర్. జగదీష్ ప్రతాప్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి ఓ డిఫ‌రెంట్ రోల్‌లో క‌నిపించ‌నున్నారు. కూతురు కోసం స‌ర్వ‌స్వం త్యాగం చేయాల‌నుకునే తండ్రి పాత్ర‌లో ఓ బ‌ల‌మైన ఎమోష‌న్ సినిమాలో ర‌న్ అవుతుంద‌ని అర్థ‌మ‌వుతుంది. అలాగే ఆద్యంతం నవ్వులతో, అనూహ్యమైన మలుపులతో అలరిస్తుంద‌ని అవ‌గ‌త‌మ‌వ‌తుంది. ఈ సంద‌ర్భంగా…

నిర్మాత మైత్రీ మూవీ మేకర్స్ వై. రవిశంకర్‌ మాట్లాడుతూ ‘‘ఎంతో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి ‘సత్తిగాని రెండెకరాలు’ స్క్రిప్ట్ చేశాం. ప్రేక్షకులకు ఎప్పుడూ ఏదో కొత్తగా చెప్పాలని, వారిని వినోదింపజేయాలనేది ఫిల్మ్ మేక‌ర్‌గా నా ఆలోచ‌న‌. అందులో భాగంగానే ఆహాతో క‌లిసి ఈ సినిమాను నిర్మించాం. మార్చి 17న విడుదల చేస్తాం’’’ అని అన్నారు.

చిత్ర దర్శకుడు అభినవ్‌ దండా మాట్లాడుతూ ‘‘సత్తిగాని రెండెకరాలు నా మనసుకు ఎంతో దగ్గరైన కథ. ఎమోష‌న్స్‌, కామెడీ, ట్విస్టులున్న ఇలాంటి కథను స్క్రీన్‌ మీదకు ఎక్కించడం చాలెంజింగ్‌గా అనిపించింది. లైఫ్ గొప్ప‌త‌నం ఏంట‌నేది చెబుతూనే .. అప్ప‌డప్పుడు అనుకోకుండా జ‌రిగే కొన్ని ఘటనలు కొంద‌రి జీవితాలను ఎలా మారుస్తాయనే విషయం గురించి ఈ చిత్రంలో చూపించాం. తప్పకుండా అన్ని వర్గాల వారికీ నచ్చుతుందని భావిస్తున్నాను ’’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News