Wednesday, January 22, 2025

‘స్వాతిముత్యం’ రిలీజ్ డేట్ వచ్చేసింది

- Advertisement -
- Advertisement -

గణేష్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ’స్వాతిముత్యం’. వర్ష బొల్లమ్మ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కంటెంట్ బలంతో దసరా శుభాకాంక్షలతో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి విడుదల తేదీని ఖరారు చేస్తూ ప్రచార చిత్రాన్ని బుధవారం విడుదల చేశారు. ‘స్వాతిముత్యం’ను అక్టోబర్ 5న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ అధికారికంగా ప్రకటించారు. స్వాతిముత్యం లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రం. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా ‘స్వాతిముత్యం’ను దర్శకుడు లక్ష్మణ్ తీర్చి దిద్దారని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.

Sathi Muthyam movie release on Oct 5th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News