Thursday, January 23, 2025

దొంగ ధర్నాలకు రెడీ అవుతున్న బండి: సతీష్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిరుద్యోగ మహాధర్నా పేరుతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టబోతున్న మహాధర్నా ఓ పొలిటికల్ స్టంట్ మాత్రమేనని, యువత దృష్టి మరల్చి, దాని ద్వారా తాము లబ్ధి పొందాలన్న నీచపు ఆలోచన తప్ప ఇందులో ఏమీ లేదని టిఎస్ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి ఆరోపించారు. అసలు ఉద్యోగాల గురించి, యువత గురించి మాట్లాడే హక్కు బిజెపికి లేదన్నారు. బండి సంజయ్‌కు అసలే లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తే, యువత, ఉద్యోగులు చదువులు, ఉద్యోగాలు పక్కన పెట్టి బిజెపి కోసం రాజకీయం చేయాలని రోడ్లెక్కాలని పిలుపునిచ్చి వారి జీవితాలతో చెలగాటమాడుతుంది బండి సంజయ్‌అని ఆయన ఆరోపించారు.

టిఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ఉన్నది కూడా మీ బిజెపి కార్యకర్తేనని, అయినా దొంగే.. దొంగా.. దొంగా.. అని అరిచినట్టు ఇప్పుడు దొంగ ధర్నాలకు రెడీ అవుతున్నావని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన మొదటి ఐదేళ్లలో లక్షా 35 వేల ఉద్యోగాలు కల్పించడంతో పాటు ఈ మధ్యే 91 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికే షన్లను ప్రభుత్వం ఇచ్చిందని, ఆ భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
అగ్నిపథ్ పేరుతో అడ్డుగోడ
దేశ సేవ చేయాలనుకునే యువతకు అగ్నిపథ్ పేరుతో ఓ అడ్డుగోడ నిర్మించారని, ఇన్ని రోజులు ఆర్మీలో ఉద్యోగం అంటే భరోసా ఉండేదన్నారు. కానీ, ఇప్పుడు మోడీ పాలనలో జవాన్ల ప్రాణాలకే కాదు, వారి భవిష్యత్‌కు భరోసా లేకుండా చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మొదట ఢిల్లీ వెళ్లి మోడీకి వ్యతిరేకంగా మోడీ ఇంటి ఎదుట ధర్నా చేయాలని బండికి ఆయన సూచించారు. మీ పదవుల కోసం యువత జీవితాలను ఫణంగా పెడుతున్న పకోడాగాళ్లు మీరు, మీ రెచ్చగొట్టే మాటలతో యువత, నిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటమాడకండి, ప్రజలు త్వరలోనే మీ ఉద్యోగాలు మీకు ఇవ్వడం పక్కా, గతంలో మాదిరి ఇళ్లలో ఖాళీగా కూర్చునే రోజులు మీకు దగ్గర్లోనే ఉన్నాయని సతీష్‌రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News