Thursday, January 23, 2025

పెద్దలను ఎదురించి ప్రేమపెళ్లి…. చెట్టుకు ఉరేసుకొని ప్రేమజంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: పెద్దలను ఎదురించి యువతి, యువకుడు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కలిసి తోటలో చెట్టుకు ఉరేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గంగమ్‌పల్లి గ్రామానికి చెందిన దాదా(30), జోత్స(26) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వేర్వేరు కులాలు కావడంతో వారి ప్రేమపెళ్లి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో మూడు నెలల క్రితం వారు గ్రామం నుంచి పారిపోయి ప్రేమపెళ్లి చేసుకున్నారు. దాదా తన భార్యను తీసుకొని ఇంటికి రావడంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దాదా తన తల్లిదండ్రులను ఒప్పించి ఇంట్లో ఉంటున్నారు. ఏమైందో ఏమో తెలియదు కాని బుధవారం సాయంత్రం తోటకు వెళ్లి వస్తామని చెప్పారు. తోటలోకి వెళ్లి ఇద్దరు చెట్టుకు ఉరేసుకొని చనిపోయారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News