Monday, November 18, 2024

ప్రియాంక గాంధీపై సత్యన్ మోకెరి పోటీ !

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు వామపక్షాలు సీనియర్ సిపిఐ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు సత్యన్ మోకెరి(70)ని పోటీకి నిలబెట్టింది. రాహుల్ గాంధీ తన వాయనాడ్ సీటును ఖాళీ చేయడంతో ఆ సీటుకు ఇప్పుడు ఉపఎన్నిక జరుగబోతున్నది. అయితే గమనించాల్సిన విశేషమేమిటంటే ఇది ప్రియాంక గాంధీ తొలిసారి పోటీ చేస్తున్న ఎన్నికల ఘట్టం.

సిపిఐ స్టేట్ కౌన్సిల్ గురువారం సమావేశమై సత్యన్ మోకెరి విషయంలో నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బినయ్ విశ్వం మాట్లాడుతూ ‘‘ మోకెరి పూర్తి స్థాయిలో పోటీపడతారు. ఆయన దేశంలో జరిగిన అనేక రైతు ఉద్యమాలకు నాయకత్వం వహించారు. మేము సీనియర్ రైతు నాయకుడిని ఎల్ డిఎఫ్ అభ్యర్థిగా వాయనాడ్ నుంచి నిలబెడుతున్నాము’’ అన్నారు.

మోకెరి ప్రస్తుతం ఆల్ ఇండియా కిసాన్ సభకు జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. అది సిపిఐ రైతు విభాగం. పైగా మోకెరి కొజికోడ్ జిల్లాకు చెందిన స్థానిక వాసి. ఆయన 1987 నుంచి 2001 వరకు మూడు సార్లు శాసనసభ్యుడిగా పనిచేశారు. ఆయన నందపురం అసెంబ్లీ సీటు కు ప్రాతినిధ్యం వహించారు. మోకెరి పార్టీ విద్యార్థి విభాగం ‘ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్’ నుంచి పార్టీలో చేరారు. ఆయన ‘స్టేట్ అగ్రికల్చరల్ డెట్ రిలీఫ్ కమిషన్’ సభ్యుడిగా కూడా పనిచేశారు. మోకెరి 2014లో కూడా వాయనాడ్ నుంచి లోక్ సభకు పోటీ చేశారు. నాడు ఆయన కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ ఎం.ఐ. షానవాస్ చేతిలో 20870 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఆయన తన ప్రచారం శనివారం నుంచి కొనసాగిస్తానన్నారు. ‘‘వాయనాడ్ ప్రజలు ఎల్లప్పుడూ వామపక్ష ఉద్యమానికి తోడుగా నిలబడ్డారు. మేము రాజకీయ విధానంలోనే ఓటర్ల వద్దకు వెళ్లి ఓట్లడుగుతాము‘‘ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News