Tuesday, December 24, 2024

రేవంత్ రెడ్డి గజినీలాగా మారిపోయాడు: మంత్రి సత్యవతి రాథోడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ గజినీలాగా మారిపోయాడని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై మంత్రి సత్యవతి నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి.. నిన్ను నీ పార్టీ వాల్లే నమ్మడం లేదని, నువ్వు నీతులు చెపితే రోతగా ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను చీకటిలోకి నెట్టాలని చూస్తున్నారా అని మండిపడ్డారు.

కర్నాటక కాంగ్రెస్ గెలుపును చూసుకొని కలలు కనకండని, తెలంగాణలో ఆ పరిస్థితులు ఉండవని చురకలంటిచారు. తలకిందికి కాళ్ళుపైకి పెట్టి తపస్సు చేసిన తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ కే మూడవసారి పట్టం కడుతారని మంత్రి జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News