Friday, November 22, 2024

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సిజెలు: సుప్రీం కొలీజియం సిఫార్సు

- Advertisement -
- Advertisement -

Prematurely Retired Acting NCLAT Chairperson

న్యూఢిల్లీ: ఎనిమిది హైకోర్టులకు నూతన చీఫ్ జస్టిస్ ల నియామకానికి సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. మరో 17మంది హైకోర్ట్ జడ్జీల బదిలీకి సిఫార్సు చేసింది. ఈ నెల 16వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో సమావేశమైన కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీశ్ చంద్ర శర్మను సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇక, ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సిఫార్సు చేయగా.. అలహాబాద్ సీజే గా జస్టిస్ రాజేష్ బిందాల్, కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టీస్ గా ప్రకాష్ శ్రీవాస్తవ, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆర్ఆర్ అవస్థి, మేఘాలయ హైకోర్ట్ సిజే గా జస్టిస్ రంజిత్ విమోర్, గుజరాత్ హైకోర్ట్ సిజేగా జస్టిస్ అరవింద్ కుమార్, మధ్యప్రదేశ్ హైకోర్ట్ సిజేగా జస్టిస్ ఆర్ వి మలిమత్ ని నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.

అలాగే 5 రాష్ట్రాల హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి ఆంధ్రప్రదేశ్ నుండి ఛత్తీస్‌గఢ్ కు బదిలీ చేయగా.. మధ్యప్రదేశ్ హైకోర్టు సిజే మొహమ్మద్ రఫిక్ ను హిమాచల్ ప్రదేశ్ కు, త్రిపుర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అకిల్ ఖురేషి రాజస్థాన్ కు, రాజస్థాన్ సిజే జస్టిస్ ఇంద్రజిత్ మహంతిని త్రిపురకు, మేఘాలయ చీఫ్ జస్టిస్ బిశ్వనాథ్ సోమదర్ సిక్కింకు బదిలీ చేస్తూ సిఫారసు చేసింది.

Satish Chandra Sharma as chief justice of Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News