Friday, November 22, 2024

తెలంగాణ హైకోర్టు సీజేగా జ‌స్టిస్ స‌తీష్‌చంద్ర‌ శ‌ర్మ ప్ర‌మాణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర శ‌ర్మ ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఉదయం రాజ్‌భ‌వ‌న్‌లో జ‌స్టిస్ స‌తీష్‌చంద్ర శ‌ర్మ చేత గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ప్ర‌మాణం చేయించారు. అనంత‌రం ఆయ‌న‌కు గ‌వ‌ర్న‌ర్, సిఎం కెసిఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో సిఎం కెసిఆర్, సిఎస్ సోమేశ్ కుమార్‌ పలువురు అధికారులు పాల్గొన్నారు.

1961 నవంబర్ 30న జస్టీస్ సతీష్ చంద్ర శర్మ జన్మించారు. జబల్ పూర్ లోని సెంట్రల్ స్కూల్ లో ప్రాథమిక విద్యను పూర్తిచేశారు. సాగర్‌లోని హరిసింగ్‌గౌర్‌ యూనివర్సిటీలో బీఎస్సీ చేసిన ఆయన నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పొందారు. ఇదే యూనివర్సిటీలో 1984లో ఎల్‌ఎల్‌బి పూర్తి చేసిన ఆయన మూడు బంగారు పతకాలు సాధించారు.. 2004లో ఆయన సీనియర్ ప్యానెల్ కౌన్సెల్ గా పదోన్నతి లభించింది. 42ఏళ్లకే సీనియర్ న్యాయవాది హోదా దక్కింది. గత ఆగస్టు 31 నుంచి ఇప్పటి వరకు కర్ణాటక హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ పని చేశారు.

Satish Chandra Sharma takes over as Telangana HC CJ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News