Monday, December 23, 2024

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ

- Advertisement -
- Advertisement -

 

Telanganan HC CJ SatishChandra Sharma

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్ భూయాన్‌కు పదోన్నతి కల్పిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. గతంలో సతీష్ చంద్రశర్మ కర్ణాటక హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. మధ్యప్రదేశ్ హైకోర్టుకు 2008 జనవరి 18న అదనపు న్యాయమూర్తిగా అపాయింట్ అయిన ఆయన జనవరి 15, 2010న పర్మినెంట్ జడ్జి అయ్యారు. 2021 అక్టోబర్‌లో తెలంగాణ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.

Telangana New CJ Ujjal Bhuyan

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News